నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టరు దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. ఆ తర్వాత కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. దాంతో మళ్లీ గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. రక
స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి కూడా మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది.
ఎలాగైనా అధిక బరువుని తగ్గించుకుని నాజూగ్గా, ఫిట్‌గా మారదామనే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకోసం జిమ్‌కు వెళ్లి విపరీతమైన వర్కవుట్లు చేయడం, యోగాసనాలు వేయడం, డైట్ ప్లాన్స్‌ను అనుసరించడం చేస్తుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గే క్రమంలో తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకునే బదులు కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మేలంటున్నారు.
సాధారణంగా సినిమాలు, సీరియల్స్‌లో అమ్మ/గృహిణి పాత్రలెలా ఉంటాయి.. కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంటి పనులన్నీ పని మనుషులతో చేయించుకుంటూ లేదంటే పని మనిషికి ఇంటిపనుల్లో అడపాదడపా సహాయపడుతూ కనిపిస్తారు. అలాగే పురుషులు భార్యను ప్రేమించే భర్తగా, తల్లిని ప్రేమించే కొడుకుగా కనిపిస్తారు.
అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలివి. మనం గమనిస్తే.. ఇప్పటికీ వారి జుట్టు దృఢంగానే ఉంటుంది. ముదిమి మీద పడినప్పటికీ శరీరఛాయ మాత్రం మిసమిసలాడిపోతుంది. దీనంతటికీ కారణం వారు పాటించే సహజసిద్ధ సౌందర్య చిట్కాలే.. ఇప్పటిలాగా అప్పట్లో మార్కెట్లో లెక్కకు మిక్కిలి సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో లేవు కదా..! అందుకే వాళ్లు అలా చేశారు.. ఇప్పుడు మనకి ఆ అవసరం లేద�