అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలివి. మనం గమనిస్తే.. ఇప్పటికీ వారి జుట్టు దృఢంగానే ఉంటుంది. ముదిమి మీద పడినప్పటికీ శరీరఛాయ మాత్రం మిసమిసలాడిపోతుంది. దీనంతటికీ కారణం వారు పాటించే సహజసిద్ధ సౌందర్య చిట్కాలే.. ఇప్పటిలాగా అప్పట్లో మార్కెట్లో లెక్కకు మిక్కిలి సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో లేవు కదా..! అందుకే వాళ్లు అలా చేశారు.. ఇప్పుడు మనకి ఆ అవసరం లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నట్లే.