ఆ కళాకారు&#x

ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది...


ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది...
 
ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్ట్‌ ఆమెను కదిలించింది... ఓ వ్యక్తి రెండు చేతులూ జోడించి ‘ఆకలితో ఉన్నా.. ఆదుకోండి’ అంటూ ఉన్న ఆ పోస్టు గురించి ఆరా తీసింది. అదో నృత్యకళాకారుడిది. దాంతో ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చిందామెకు. ఎందుకంటే ఆమె కూడా ఓ నృత్యకళాకారిణే. ఆ క్షణంలో ఆమెకొచ్చిన ఆలోచన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికే కాదు.. అటువంటి వందలాదిమంది కళాకారుల కడుపు నింపింది
37 ఏళ్ల డాక్టర్‌ భావన. ‘సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌’ పిలుపుతో కళాకారులకు భరోసా ఇస్తున్న ఆమె తన గురించి తెలిపారిలా...
మాది విజయవాడ. చిన్నప్పుడు నేను బరువు తగ్గాలని అమ్మ నన్ను నృత్యంలో చేర్పించింది. కారణమేదైనా నాకు మాత్రం నృత్యం అంటే ప్రాణంగా మారింది. అందుకే జీవీఆర్‌ మ్యూజిక్‌  ¥లేజీలో డిప్లొమా చేశా. ఆ తర్వాత కూచిపూడి కళాక్షేత్రలో ఎమ్‌ఏ డ్యాన్స్‌ పూర్తి చేశా. పెళ్లైన తర్వాత హైదరాబాద్‌ వచ్చా. కూచిపూడి నృత్యప్రదర్శనలిస్తూ, సొంతంగా ‘శారదా కళాక్షేత్ర డాన్స్‌ అకాడమీ’  స్థాపించి 150 మంది విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణనిస్తున్నా.  
రోడ్డున పడి...
ఫేస్‌బుక్‌లో  మా రంగంలో ఉన్నవారందరికీ ఓ గ్రూప్‌ ఉంది. గతేడాది మార్చి మొదటివారంలో అందులో ఓ పోస్ట్‌ను చూశా. ఓ నృత్యకళాకారుడి ఆవేదన అది. ఆ ఫొటోను చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. కడుపులో మెలిపెట్టినట్లు అయ్యింది. ఆయన చిత్తూరుకు చెందిన ఓ కూచిపూడి కళాకారుడు. కొవిడ్‌ కారణంగా  ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ రోజంతా ఆయన నా కళ్లెదుటే ఉన్నట్లనిపించింది.  ఏదో ఒకటి చేయాలని ఆలోచించా. వెంటనే తెలిసిన వారందరినీ సంప్రదించా. ఇలా మరెందరో కళాకారులు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా.. అటువంటి వారందరినీ ఆదుకోవాలనిపించింది.  
‘సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌’...
కూచిపూడి శిక్షణా పథకం కింద దాదాపు 400 మంది కళాకారులకు గతంలో ఉద్యో గాలుండేవి. అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉపాధి కోల్పోయారు. తర్వాత వారంతా ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూపును సంప్రదించా. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులందరికీ చేయూతనివ్వడానికి నా ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఓ  ఆలోచన వచ్చింది. ‘సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌’ పేరుతో  ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఒక లైవ్‌ ప్రోగ్రాం  ప్రారంభించా. ఇందులో రోజుకొక కళాకారుడితో వారి కష్టాలను చెప్పించేదాన్ని. ప్రభుత్వం చేయుత´తనివ్వాలని కోరేదాన్ని. రెండుమూడు గంటలపాటు జరిగే ఆ కార్యక్రమం సోషల్‌మీడియాలో  చాలా స్పందనను తెచ్చింది. లైవ్‌ మొదలైన రెండో రోజునే కూచిపూడి కళాకారుడు వెంపటి వెంకట్‌ స్పందించారు. ఆ తర్వాత మరెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆర్థికంగా చేయూతనందించడానికి చాలామంది ముందుకొచ్చారు. ఆ నగదుని ఓ ట్రస్టు ద్వారా సేకరించాం. మరోవైపు దయనీయ స్థితిలో ఉన్న నృత్యకళాకాలందరినీ గుర్తించడానికి జిల్లాలన్నింటిలో వాలంటీర్లుగా పనిచేయడానికి కొందరు  ముందుకొచ్చారు.  ఇలా ఆంధ్రలో 600, తెలంగాణలో 800 మంది కళాకారులను గుర్తించి అందరికీ తక్షణసహాయంగా తలా రూ.1000 చొప్పున ముందుగా అందించాం. హైదరాబాద్‌, మెదక్‌ ప్రాంతాల్లో ఉండేవారికి నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం. అలా నాలుగునెలలపాటు పేద కళాకారులకు సాయం అందేలా  కృషి చేశా. దేశంలోనే కాదు.. అమెరికా, లండన్‌ దేశాల నుంచి కూడా పలువురు కళాకారులు తమ  వంతు చేయూతనందించారు. ఒక్కొక్కరు రూ.500 పంపితే, మరొకరు రూ. లక్ష  కూడా ఇచ్చారు. ఆ నాలుగునెలలూ ఓ కార్పొరేట్‌ సంస్థ సిబ్బందిలా పని చేశాం. వృద్ధులకు  ఆసుపత్రి ఖర్చులు తలా అయిదువేలు పంపించేవాళ్లం. మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఆర్థికసాయంతోపాటు నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం.
పింఛను ఇప్పించి...
లాక్‌డౌన్‌ తర్వాత కళాకారులకు ఉపాధి దొరకడం కష్టమైంది. దాంతో పలు కార్పొరేట్‌ సంస్థల  సహాయం తీసుకుంటున్నాం. ఆలయాల్లో కళాకారుల నృత్యప్రదర్శన ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జేఎస్‌పీఎల్‌ సంస్థ ద్వారా 12 మంది వృద్ధకళాకారులకు వారి జీవితాంతం తలా రెండున్నరవేల రూపాయలు నెలనెలా పింఛను అందేలా చేశా. దానికి కన్నీళ్లతో వారు చెప్పే కృతజ్ఞతలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. త్వరలో అంతర్జాతీయ  కూచిపూడి సమాఖ్యను ప్రారంభించనున్నా. ఇందులో ప్రతి కళాకారుడు సభ్యుడిగా చేరొచ్చు. వెంపటి  చినసత్యంగారి జ్ఞాపకార్థం ఏటా అక్టోబరు 15న ‘వరల్డ్‌ కూచిపూడి డే’గా జరుపుకోవడం  గతేడాది నుంచి ప్రారంభించాం.
Tags :

Related Keywords

, ఆ , కళ క ర డ , ఆవ దన కద ల చ ద , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121041958 , Artist , Ladies , Save , Kuchipudi , Dance , Training , Vasundara , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Top Stories , Telugu Top Stories , ஈனது , வாசுந்தர , கட்டுரை , ஜநரல் , கலைஞர் , பெண்கள் , சேமி , குச்சிபுடி , நடனம் , பயிற்சி , ஈனது வாசுந்தர , வெற்றிகரமாக பெண்கள் கதைகள் இல் தெலுங்கு , அழகு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , பெண்கள் ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , பெண்கள் உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , சமையல் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , பெண்கள் உணவு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , அன்பே வாசுந்தர , பெண்கள் ஃபேஷன்கள் , பெண்கள் அழகு உதவிக்குறிப்புகள் , பெண்கள் ஆரோக்கியம் ப்ராப்லம்ஸ் , பெற்றோருக்குரியது உதவிக்குறிப்புகள் , குழந்தை பராமரிப்பு , பெண்கள் முடி பாணிகள் , நிதி உதவிக்குறிப்புகள் க்கு பெண்கள் , உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் , கடையில் பொருட்கள் வாங்குதல் உதவிக்குறிப்புகள் , மேல் கதைகள் , தெலுங்கு மேல் கதைகள் ,

© 2025 Vimarsana