సముద్రానికి అండ!
మార్పు కోరుకుంటే సరిపోదు. ఆ దిశగా అడుగులు వేయగలగాలి! అందుకోసం పెద్ద చదువులు అక్కర్లేదు. ఆశయం గట్టిదై ఉండాలి. అందుకు ఉదాహరణ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన తాడి దీపిక. తొమ్మిదో తరగతి మాత్రమే చదువుకున్న ఈవిడ సముద్ర కాలుష్యంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది. ఆ చొరవే. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఆన్‌లైన్ కార్�