comparemela.com


సముద్రానికి అండ!
మార్పు కోరుకుంటే సరిపోదు... ఆ దిశగా అడుగులు వేయగలగాలి! అందుకోసం పెద్ద చదువులు అక్కర్లేదు... ఆశయం గట్టిదై ఉండాలి. అందుకు ఉదాహరణ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన తాడి దీపిక. తొమ్మిదో తరగతి మాత్రమే చదువుకున్న ఈవిడ సముద్ర కాలుష్యంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది. ఆ చొరవే... ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మన దేశం తరఫున పాల్గొనే అవకాశాన్ని అందించింది. ఆ వివరాలు ఆమె మాటల్లో...
సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. అలాంటి నీటికి కాలుష్యంతో వచ్చే అనర్థాలు ఇన్నీ అన్నీ కావు. సముద్ర జలాలు విషతుల్యాలమై పెరిగి మానవాళి మనుగడ సంక్లిష్టంగా మార్చేశాయి. ముఖ్యంగా మత్స్య సంపద కాలుష్య కోరల్లో పడి విలవిల్లాడిపోతోంది. వాతావరణ పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది అని సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఈ దిశగా అందరిలోనూ చైతన్యం కలిగించాలని నిర్ణయించుకున్నా. నేను తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నా. మా వారు ప్రదీప్‌తో కలిసి వ్యవసాయ పనులు చేసుకునేదాన్ని. పర్యావరణ కాలుష్యం, రసాయన పంటల గురించి చాలాసార్లు విన్నప్పటికీ ఎలా అడ్డుకట్ట వేయాలో తెలిసేది కాదు. మా ఊరు అంతర్వేది సాగర సంగమ ప్రదేశంగానే కాకుండా ప్రసిద్ధ లక్ష్మీనృసింహ దివ్యక్షేత్రం కూడా. నిత్యం భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఫిషింగ్‌ హార్బర్‌ ఉంది. పెద్ద సంఖ్యలో మత్స్యకారులు చేపల వేటకొస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. వీటన్నింటి వల్ల అందమైన మా ఊరి సాగర తీరం కలుషితమైపోయింది. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. ఇవి నదీ జలాల ద్వారా సముద్రంలోకి పెద్ద ఎత్తున చేరడంతో నీళ్లు విషతుల్యమవుతున్నాయి. దీని ప్రభావం మత్స్య సంపదపైనా పడింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. గత ఫిబ్రవరిలో మా ఊరిలో గ్రీన్‌ వార్మ్‌, స్మార్ట్‌ విలేజ్‌ మూవ్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. స్వతహాగా పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఉన్న మేం మొదట ఉపాధి కోసమే ఇందులో చేరాం.
ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి...
గ్రామంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి కేంద్రానికి తీసుకురావడం నిత్యం మా పని. ప్లాస్టిక్‌ ఇంత హాని చేస్తుందని నాకు అప్పటి వరకూ తెలియదు. తెలిశాక తీరంలో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించేందుకు నా బాధ్యతగా చొరవ తీసుకున్నాను. స్థానిక నిర్వాహకులు, ప్రతినిధులు చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకున్నా. అదే నాకు ఈ రోజు ఈ గొప్ప అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించింది. గ్రీన్‌వార్మ్‌ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్‌ గుంటేటి, సమన్వయకర్త గంటా సునీల్‌, స్మార్ట్‌ విలేజ్‌ మూవ్‌మెంట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ వై.ఎస్‌.మైఖేల్‌ ప్రోత్సాహంతో నా భర్తతో కలిసి గ్రామంలో ప్లాస్లిక్‌ వ్యర్థాలను సమూలంగా నిర్మూలించే దిశగా కార్యాచరణ చేపట్టాను. ఇళ్లు, దుకాణాల దగ్గర కూడళ్లలో, బీచ్‌ల్లో వ్యర్థాల కోసం ప్రత్యేకంగా ఇనుప బుట్టలను ఏర్పాటు చేశాం. అందులోని చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి జీరో వేస్ట్‌ కేంద్రానికి తీసుకొచ్చి వాటిని విభజిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడా వ్యర్థాలు కనిపించడం లేదు. తీరం ఆహ్లాదకరంగా మారుతోంది. మాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి కెన్నీబాబు పది, అమ్మాయి బ్లెస్సీ నాలుగో తరగతి చదువుతున్నారు. వారిని బాగా చదివించడం, మా కృషిని విస్తరించడం మా లక్ష్యం. మేం చేస్తున్న పనితో భవిష్యత్తు తరాలూ బాగుంటాయనేది మా ఆలోచన.
- కె.త్రినాథస్వామి, మామిడికుదురు
- సీహెచ్‌.నరసింహస్వామి, అంతర్వేది
Tags :

Related Keywords

,సమ ద ర న క ,Enadu ,Vasundhara ,Article ,Eneral ,002 ,21114621 ,Sea ,Plastic ,Wastage ,Sour ,Pollution ,Woman ,Eenadu Vasundhara ,Successful Women Stories In Telugu ,Beauty Tips In Telugu ,Women Health Tips In Telugu ,Women Fitness Tips In Telugu ,Cooking Tips In Telugu ,Women Diet Tips In Telugu ,Dear Vasundhara ,Women Fashions ,Girls Fashions ,Women Beauty Tips ,Women Health Problems ,Parenting Tips ,Child Care ,Women Hair Styles ,Financial Tips For Women ,Legal Advice For Women ,Fitness Tips ,Shopping Tips ,Op Stories ,Elugu Top Stories ,வாசுந்தர ,ஈயா ,நெகிழி ,புளிப்பான ,பொல்யூஶந் ,பெண் ,ஈனது வாசுந்தர ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.