మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?
సమస్య-సలహా
సమస్య: నా వయసు 50 సంవత్సరాలు. మధుమేహంతో బాధపడుతున్నాను. ఎండకాలంలో పుచ్చకాయలు ఎక్కువగా వస్తుంటాయి కదా. మధుమేహం గలవారు వీటిని తినొచ్చా?
- రమేశ్, హైదరాబాద్
సలహా: పుచ్చకాయ చాలా తీయగా ఉండటం వల్ల మధుమేహుల్లో చాలామందికి ఇలాంటి సందేహమే వస్తుంటుంది. అయితే దీని విషయంలో మరీ భయపడాల్సిన పనేమీ లేదు. ఆయా పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎంత వే�