చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంటులో వాటిపై విస్తృత స్థాయి చర్చలు జరగకపోవడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వం పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని గుర్తుచేశారు. Justice NV Ramana పార్లమెంటులో చర్చలపై జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంటులో వాటిపై విస్తృత స్థాయి చర్చలు జరగడం లేదని, అసలు ఏ చట్టాలు ఎందుకు చేశారో.. ఏ లక్ష్యంతో చేశారో.. ఎవరిని ఉద్దేశించి చేశారో కూడా అర్థం కావట్లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. 75వ స్వాతంత్య్ర దిన�