గోరువెచ్చని నూనెతో మాడుకు నెమ్మదిగా మర్దన చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదూ! ఈవిధంగా మర్దన చేసుకోవడం వల్ల కేవలం మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ క్రమంలో మర్దన చేసుకోవడం వల్ల కలిగే ఇతర లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం కూడా తప్పనిసరి.