పిల్లలను బడికి పంపాలా? వద్దా? ప్రస్తుతం తల్లిదండ్రుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్న ఇదే. ఒకవైపు బడుల పునః ప్రారంభం. మరోవైపు కొవిడ్-19 మూడో దశ ముంచుకురావొచ్చనే హెచ్చరికలు. ఈ నేపథ్యంలో ఎవరికైనా ఊగిసలాట సహజమే. బడికి పంపకపోతే పిల్లలు చదువుల్లో మరింత వెనకబడి పోతారనే ఆందోళన కొందరిది. పిల్లల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమా? అనే భయం ఇంకొందరిది. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎటు వైపు మొగ్గాలి? బడికి పంపాలా? వద్దా?