ఉప వ్యాఖ్యానం
బలవంతపు వసూళ్ల మహాజాడ్యం
మూడు దశాబ్దాల క్రితం ముంబయి మహానగరం కరడు గట్టిన అధోజగత్ నేరగాళ్ల (అండర్ వరల్డ్ డాన్) కార్యక్షేత్రంగా పేరెన్నికగన్నది. హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లతో నాడు ముంబయిని గడగడలాడించిన వాళ్లలో ఒకడైన అరుణ్ గావ్లీకి రెండు పుష్కరాల క్రితం భారత ప్రజాస్వామ్య బోధివృక్షం కింద హఠాత్తుగా జ్ఞానోదయమైంది. తన పేరు చెబితేచాలు- ఎంతటివార�