పండంటి కిడ్నీకి 12 సూత్రాలు!
ఎల్లుండి వరల్డ్ కిడ్నీ డే
ఒంటికి చీపుర్లు మూత్రపిండాలే! ఇవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను వేరుచేసి, వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కళకళలాడుతుంది. లేకపోతే చెత్త కుప్పలా తయారవుతుంది. అందుకే ఎక్కడైనా ఎవరైనా కిడ్నీల ఆరోగ్యం మీద దృష్టి సారించాలని, ఒకవేళ కిడ్నీ జబ్బు మొదలైనా తగు జాగ్రత్తలతో హాయిగా జీవించ