సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసన సెగలు రేపుతున్న పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం ప్రారంభమైంది. పెగాసస్ స్పైవేర్ స్కాంపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన 9 పిటిషన్లను గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.