ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్స్‌ను ఎక్కువగా కలపతో చేయిస్తున్నాం. గచ్చు కూడా కలప అయితే మరింత ఆకర్షణీయంగా, విలాసవంతంగా ఉంటుందని మురిసిపోతున్నాం.. అక్కడికే పరిమితం కాకుండా ఇప్పుడు మొత్తం ఇంటినే కలపతో కట్టేయవచ్చు అంటున్నారు నిర్మాణదారులు. సాధ్యమా కలప ఇళ్లు.. తిప్పుకోలేరు కళ్లు
గత కొంతకాలంగా మహమ్మారితో అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నా.. సొంతింటి కలను నిజం చేసుకుంటున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నో నెలలు ఆలోచించి, అవసరమైన నిధులను సమకూర్చుకొని, ఇంటి