తనలాంటివారి కోసమే ఆ దుస్తులు!
ఉన్నత చదువులు చదివి ఐదంకెల్లో జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని తెచ్చుకుంది. జీవితంలో మరో అడుగు ముందుకేయాలనుకున్న సమయంలో మాయదారి అనారోగ్యం ఆమెను చుట్టుముట్టింది. దవడ వద్ద మొదలైన అరుదైన వ్యాధి కాలివేళ్ల వరకూ వ్యాపించింది. ఉత్సాహానికి మారుపేరుగా ఉండే ఆమె.. కుర్చీకే పరిమితమైపోయింది. మరొకరి సాయం లేనిదే దుస్తులను కూడా ధరించలేని నిస్సహాయ స్థితిక�