న్యూఢిల్లీ: భారత్ ప్రభుత్వంపై దావాల కొనసాగింపు విషయంలో కెయిర్న్ ఎనర్జీ వెనక్కు తగ్గుతుంది. ఇందుకు సంబంధించి న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎయిర్ ఇండియాపై తాను వేసిన ఒక దావాపై స్టేను కోరుతూ స్వయంగా ముందుకు వచ్చింది. ఎయిర్ ఇండియాతో కలిసి ఈ మేరకు న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రెట్రాస్పెక్టివ్ పన్ను రద్దుపై భారత్ నిర్ణయం, ఈ నిర్ణయం అమలుకు విధివిధానాల అమ