తాడికొండ: ఆనందయ్య కరోనా మందు పేరుతో అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షలు, 150 ప్యాకెట్ల మందును స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ ఎస్‌ఐ బి.వెంకటాద్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో కరోనా మందు పేరిట అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం గ్రామంలో సోదాలు నిర్వహించారు.
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగె ఆనందయ్య తయారుచేసిన ఐ డ్రాప్స్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను క్రిమిరహిత (స్టెరిలిటీ) పరీక్షకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా.. గరిష్టంగా రెండు వారాల్లో ఆ పరీక్ష నివేదిక ఇచ్చేటట్లు చూడాలని స్పష్టం చేసింది. ఆనందయ్య తయారు చేసిన మందుల్లో �