కమలాపూర్/హుజూరాబాద్ : కేసీఆర్ ఒక్కడితో తెలంగాణ రాష్ట్రం రాలేదని, వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ఏడేళ్లుగా కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూం ఇల్లు ఏమయ్యాయని