నిపుణులు ఇచ్చిన సమాధానాలు
సర్, నా పేరు సుధాకర్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు రూ. 5000 మదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ, ఆన్లైన్ లో ఎలా చేయాలి? ఎలాంటి వెబ్సైట్ లో మంచిది?
Asked by Tejavath sudhakar on
26 జూన్ 2021
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు.
నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
మరిన్ని