సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం కావడంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ తన దూకుడు పెంచింది. మరోవైపు ఉపఎన్నికకు ముందు ఈసీ తాజాగా ఇచ్చిన సంకేతాలతో మిగిలిన పార్టీలు కూడా కదనరంగంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.