దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి తొలి అడుగు పడింది. దీనికి సంబంధించి ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ శుక్రవారం పూర్తయింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి అధికారిక నివాస గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్టు డీడ్‌పై జస్టిస్ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రన్, జస్టిస్ హిమా కోహ్లి, న్యాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి తదితరులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నా కల నెరవేరుతోంది