పచ్చికపై రాకెట్ల సమరానికి వేళైంది. నేటి నుంచే వింబుల్డన్. కరోనా వైరస్ కారణంగా నిరుడు రద్దయిన ఈ టోర్నీపై ఇప్పుడు అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ పురుషుల సింగిల్స్‌తో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. జకోవిచ్‌కు ఎదురుందా?