కలయిక తర్వాత దురద... సమస్యా?
నా వయసు 45. ఈ మధ్య తరచూ మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. అలాగే వెజైనా దగ్గర పొడిగా ఉండి దురద పెడుతోంది. కలయికలో పాల్గొన్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. ఇదేమైనా ప్రమాదమా?
- ఓ సోదరి
ఈ వయసులో డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి ఉన్నప్పుడు తరచూ మూత్రం రావడం, ఆ ప్రాంతం పొడిబారడం, దురదపెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊబకాయులైతే షుగరు, హోమా ఐఆర్ పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా వెజైనాలో వైరల్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరోసారి గైనకాలజిస్ట్‌ను కలవండి. షుగరు నిర్థరణ అయితే ముందుగా ఆ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఇన్‌ఫెక్షన్ తగ్గడానికి దంపతులిద్దరూ మందులు వాడాలి. సమస్య పూర్తిగా తగ్గేవరకు కలయికలో పాల్గొనొద్దు. ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉంది. యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడటం వల్లా ఈ సమస్య రావొచ్చు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ఉందేమో కూడా పరీక్ష చేయించుకోండి.
Tags :