comparemela.com


మిగిలిన అన్నాన్ని...అమృతంగా మార్చి!
పిడికెడు పొట్ట నింపుకోవడానికి... పట్టెడన్నం చాలు.  కానీ దానికోసమే రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే వాళ్లు మాత్రం ఎందరో. అలా తమ దుకాణంలో ఆకలితో పనిచేస్తోన్న పనివారికి రోజూ భోజనం పెట్టాలనుకుందో మహిళ. ఆ సంకల్పమే ఇంతింతై... ‘అమృతమయి ఛారిటబుల్‌ ట్రస్టు’ ద్వారాఇప్పుడు నిత్యం వేలాది మంది కడుపు నింపుతోంది. ఆ మహిళే గుంటూరుకి చెందిన కొప్పురావూరి రజని.
రెండొందల మందికి అంచనా వేసుకుని గుంటూరు నగరంలో పుట్టినరోజు వేడుక నిర్వహించిందో కుటుంబం. కానీ భారీ వర్షం కారణంగా వందమంది మాత్రమే హాజరయ్యారు. దాంతో వండిన పదార్ధాలన్నీ మిగిలిపోయాయి. ఆ విషయం తెలుసుకున్న అమృతమయి వాహనం అక్కడికి చేరుకుంది. వాటిని సేకరించి నేరుగా రైల్వేస్టేషన్‌ కూడలికి వెళ్లి నిలిపింది. అంతే ఆకలితో ఉన్నవారంతా లైను కట్టారు. నిమిషాల్లోనే భోజనం అయిపోయింది. ఇది ఒక ఉదాహరణే కావొచ్చు కానీ...ఫలానా హోటల్లో, ఫంక్షన్‌లో ఎక్కడ ఆహారం ఉందని చెప్పినా ఇంతే చేస్తారు. ఆ పదార్థాలతో ఆకలిగా ఉన్నవారి కడుపు నింపుతారు రజని. ఈ ఆలోచన వెనక ఓ పెద్ద కథే ఉంది అంటారామె. ‘ముప్పై ఏళ్ల క్రితం గుంటూరులో ఓ దుస్తుల దుకాణం ప్రారంభించాం. షాపులో పనిచేసేవారు ఎప్పుడో పొద్దున్న తెచ్చుకున్న ఆహారం మధ్యాహ్నానికి పాడైపోయి తినలేని పరిస్థితి ఉండేది. అలాగని చేతిలో ఉన్న కొద్ది డబ్బులూ ఖర్చుచేసి బయట తినలేక అలానే ఉపవాసం ఉండేవారు. ఓ సారి ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దాంతో మా దగ్గర పనిచేసే అందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో వాళ్లకి నా ఆలోచన చెప్పడంతో ప్రోత్సహించారు. అలా మొదలయ్యింది ఈ కార్యక్రమం. ఈ పని మా ఇంటిల్లిపాదికీ సంతోషం కలిగించేది. తర్వాత  మరో అడుగు ముందుకేశా. తర్వాత రోజు నుంచి  గుంటూరు ఫీవర్‌ ఆసుపత్రిలో రోజూ నూటయాభైమందికి అన్నం వండి పెట్టడం మొదలుపెట్టా’ అంటారు రజని.
ఆహారం వృథా కానివ్వకుండా...  కుటుంబ సభ్యుల పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాలను కూడా అన్నదానం చేయడానికి ఉపయోగించుకున్నారు రజని. ‘ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా...సరే మా ఇంటి నుంచి అనాథ శరణాలయాలు, వసతిగృహాలు, రోడ్డు పక్కన ఉండేవారికి భోజనం పెట్టడాన్ని ఆనవాయితీగా చేసుకున్నాం. కానీ ఆకలితో ఇంకా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందుకే అందరి సహకారమూ తీసుకోవాలనుకున్నా. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథాకానివ్వకుండా నిస్సహాయులకు పంచితే... అనే ఆలోచన వచ్చింది. కానీ ఇది అనుకున్నంత సులువేం కాదు..ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యంతో చెలగాటం ఆడినట్లే అందుకే ప్రత్యేక నిబంధనలు ఏర్పరుచుకున్నాం. జాగ్రత్తలూ తీసుకుంటాం. ఇందుకోసం సుమారు పదిలక్షల రూపాయలు వెచ్చించి ఆహార రవాణాకు ఓ వాహనం, డ్రైవరు, కొంత సామగ్రి ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఆహారం ఎక్కువగా ఉన్నా మాకు ఫోన్‌ చేయండి అంటూ కరపత్రాలు పంచాం. కల్యాణ మండపాలు, ఫంక్షనుహాలులో పోస్టర్లు వేశాం’ అంటారు రజని.
మూడులక్షల మందికి పైగా... రజని ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది.  క్యాటరింగ్‌ నిర్వాహకులు, కల్యాణ మండపాల వారు సమాచారం ఇస్తున్నారు. అలా ఆహారాన్ని సేకరించి ఇప్పటివరకూ సుమారు మూడులక్షలమందికి పైగా భోజనం అందించింది ఆమె సంస్థ. నెలకు రూ.లక్ష  నుంచి రూ.లక్షన్నర సొమ్ము వెచ్చిస్తున్నారు. ‘అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడా అన్నం దొరక్కపోయినా మా వాహనాల్లో ఉంటుంది. నగరంతోపాటు పరిసర ప్రాంతాలైన సత్తెనపల్లి, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనూ మా వాహనం సేవలు అందిస్తోంది. ఇప్పటివరకూ సొంత డబ్బులతోనే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం.  భవిష్యత్తులో ఫ్రీజర్లు ఏర్పాటుచేసి ఆహారం నిల్వచేసే ఆలోచన ఉంది’ అంటున్నారు రజని.
-పెనికలపాటి రమేష్‌, ఈనాడు, గుంటూరు
Tags :

Related Keywords

,మ గ ల న ,అన న అమ త గ ,మ ర చ ,Eenadu ,Vasundhara ,Article ,General ,1001 ,121015729 ,Trust ,Food ,Workers ,Labour ,Help ,Koppuravuri Rajani ,Vasundara ,Eenadu Vasundhara ,Successful Women Stories In Telugu ,Beauty Tips In Telugu ,Women Health Tips In Telugu ,Women Fitness Tips In Telugu ,Cooking Tips In Telugu ,Women Diet Tips In Telugu ,Dear Vasundhara ,Women Fashions ,Girls Fashions ,Women Beauty Tips ,Women Health Problems ,Parenting Tips ,Child Care ,Women Hair Styles ,Financial Tips For Women ,Legal Advice For Women ,Fitness Tips ,Shopping Tips ,Top Stories ,Telugu Top Stories ,ஈனது ,வாசுந்தர ,கட்டுரை ,ஜநரல் ,நம்பிக்கை ,உணவு ,தொழிலாளர்கள் ,தொழிலாளர் ,உதவி ,ஈனது வாசுந்தர ,வெற்றிகரமாக பெண்கள் கதைகள் இல் தெலுங்கு ,அழகு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,பெண்கள் ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,பெண்கள் உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,சமையல் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,பெண்கள் உணவு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,அன்பே வாசுந்தர ,பெண்கள் ஃபேஷன்கள் ,பெண்கள் அழகு உதவிக்குறிப்புகள் ,பெண்கள் ஆரோக்கியம் ப்ராப்லம்ஸ் ,பெற்றோருக்குரியது உதவிக்குறிப்புகள் ,குழந்தை பராமரிப்பு ,பெண்கள் முடி பாணிகள் ,நிதி உதவிக்குறிப்புகள் க்கு பெண்கள் ,உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் ,கடையில் பொருட்கள் வாங்குதல் உதவிக்குறிப்புகள் ,மேல் கதைகள் ,தெலுங்கு மேல் கதைகள் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.