ఒలింపిక్ గ్రామంలో మన అథ్లెట్లు ప్రదర్శించిన ఆటతీరును ఆస్వాదించాం. వారు విజయ గర్వంతో పతకాలు అందుకుంటుండగా గెలుపు మనదే అని ఉప్పొంగిపోయాం.. వాళ్ల విజయ దరహాసానికి సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని రిపీట్ చేసుకుంటూ మరీ తిలకించాం.. మరి, ఎంతసేపూ ఆటలు, క్రీడాకారులు అంటూ వాళ్ల పైనే దృష్టి పెట్టాం కానీ.. అసలు ఈ అద్భుత క్షణాలను ప్రత్యక్షంగా చూస్తూ.. క్లిక్‌మనిపించిన వ్యక్తుల గురించి బహుశా ఏ ఒక్కరూ ఆలోచించి ఉండరు.