ఊరి మధ్యలో రామాలయమో శివాలయమో ఉన్నట్టే ఊరి చివర పోచమ్మ, మైసమ్మ, గంగానమ్మ, పోలేరమ్మ ఆలయాలుంటాయి. ఇంతకీ ఈ చిన్నచిన్న గుళ్లు ఎలా వెలిశాయో గ్రామదేవతల విశిష్టతేంటో చూద్దాం. ఊరి పొలిమేరల్లో ఉండి గ్రామస్తులను, పంటచేలను అన్ని రకాల ఉపద్రవాల నుంచి రక్షించే దేవతలే గ్రామదేవతలు. ఆమే సర్వం.. ఆమే సకలం
చల్లని తల్లి.. బల్కంపేట ఎల్లమ్మ
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే.అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ. ఎల్లమ్మ! ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి. అప్పటికసలు, హైదరాబాద్ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా.బండరాయి అడ్డొచ్చినట్టు