అమరావతి : రాజధాని పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధాని గ్రామాల్లోకి ఇతరులను అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు.