పిడుగురాళ్ల: పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులైనా గడవక ముందే ఆత్మహత్యకు యత్నించింది ఓ నవ జంట. భార్య మరణించగా.. భర్త ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రజక కాలనీలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కాలనీకి చెందిన చంపాల నాగేశ్వరరావు మరణించడంతో ఆయన భార్య నాగమ్మ కూలిపనులు చేసుకుంటూ కుమార్తె