తగ్గింపు ధరలతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై తగ్గింపు ధరలను అమలు చేస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. ద డిజిటల్ ఇండియా సేల్ పేరుతో ఆగస్టు 5 వరకు ప్రతి రూ.10,000 కొనుగోలుపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 10శాతం నగదు వెనక్కి ఇస్తున్నట్లు, గరిష్ఠంగా రూ.5 వేల వరకు పొదుపు చేసుకోవచ్చని పేర్కొంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్‌డిజిటల్.ఇన్‌లో కొనుగోళ్లు చేసేందుకు వీలుందని తెలిపింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలపైనా తగ్గింపు ధరలు ఉన్నాయని తెలిపింది. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, రెఫ్రిజిరేటర్లపైనా భారీ రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇవీ చదవండి