రెండు వేర&#x

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి


Updated : 17/07/2021 07:14 IST
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
గుడిహత్నూర్‌: తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం మన్నూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మినీ లారీ, ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఘటన జరిగింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. నడిచి వెళ్తున్న కూలీలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. మృతులను మహారాష్ట్రకు చెందిన సందీప్‌(18), వెంకట్‌ పవార్‌(15)గా గుర్తించారు. 
Tags :

Related Keywords

Telangana , Andhra Pradesh , India , , Mini Larry , தெலுங்கானா , ஆந்திரா பிரதேஷ் , இந்தியா ,

© 2025 Vimarsana