ఆరోగ్యాన

ఆరోగ్యాన్నిచ్చే ఆల్‌బుకారా!


ఆరోగ్యాన్నిచ్చే ఆల్‌బుకారా!
పోషకాలమ్‌
ఎర్రటి రంగులో యాపిల్‌లా... ఆకారంలో టొమాటోలా ఉంటూ బోలెడన్నీ  పోషకాలుండే ఆల్‌బుకారా పండు అందించే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...
* కొంచెం వగరుగా, మరికొంచెం పుల్లగా ఉండే ఆల్‌బుకారా పండ్లంటే అందరికీ ఇష్టమే.
జ్వరం వచ్చి నోటికి ఏది రుచించని సమయంలో ఈ పండు తింటే ఆకలి పెరుగుతుందని చెబుతారు. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్‌-సి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అలసటను తగ్గిస్తుంది. నీరసాన్ని దరి చేరనివ్వదు. దాంతో ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లు తలెత్తవు.
* ఇందులోని విటమిన్‌-ఎ దంతక్షయం రాకుండా రక్షిస్తుంది. ఈ పండులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* రక్తప్రసరణను క్రమబద్ధీకరించడంతోపాటు, ఎర్ర రక్తకణాల పెరుగుదలకూ సాయపడుతుంది.
* ఆస్తమా, ఆర్థ్రరైటిస్‌, ఆస్టియోపోరోసిస్‌, గుండె జబ్బులకు చెక్‌ పెడుతుంది.
* ఈ పండులోని కొన్ని సమ్మేళనాలు జీర్ణశక్తిని క్రమబద్ధీకరిస్తాయి.
* దీన్ని తరచూ తీసుకున్న వారిలో మలబద్ధకం సమస్య ఉత్పన్నం కాదు.
* ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.
* వీటిని తింటే ఎముకలు పటిష్టమవుతాయి. వీటిలో పీచూ,  మెగ్నీషియం, ఫోలిక్‌ ఆమ్లం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.
* ఈ పండ్లు శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేలా చేస్తాయి.
* వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు జీవక్రియలతోపాటు రక్తప్రసరణనూ సాఫీగా సాగేలా చేస్తాయి.
* రక్తహీనతను తగ్గించి రక్తవృద్ధికి తోడ్పడతాయి.
* ఈ పండ్లలోని పొటాషియం శరీర కణాలకు మేలు చేస్తుంది. గుండెపోటు, రక్తపోటును నియంత్రిస్తుంది.
Tags :

Related Keywords

, ఆర గ య న చ , Enadu , Kaaha , Article , Eneral , 602 , 21129641 , Slum , Alubukhara , Vitamin A , Vitamin C , Gravity , Bronchial Asthma , Arthritis , Heart Disease , ஆஹா , லம் ,

© 2025 Vimarsana