రోగ్‌ డ్రోన్లపై 'ఇంద్రజాలం'


రోగ్‌ డ్రోన్లపై ‘ఇంద్రజాలం’
కృత్రిమ మేథ, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీల సమ్మేళనం
మానవ రహిత విమానాలకు, డ్రోన్స్‌కు చెక్‌
భారతీయ కంపెనీ విప్లవాత్మక టెక్నాలజీ 
ప్రధాన కార్యాలయం మన హైదరాబాద్‌లోనే
(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)
విశ్వామిత్రుని యాగం భగ్నం చేయడానికి  మారీచసుబాహులు ఆకాశం నుంచి రక్తం, ఎముకలు కుమ్మరిస్తుంటారు! కానీ.. రామలక్ష్మణులు తమ బాణాలతో à°¯ జ్ఞవాటికపై ఓ వలయం సృష్టించి అవేవీ యజ్ఞకుండంలో పడకుండా చూస్తారు. ఈ సీన్‌ చాలా సినిమాల్లో చూ శాం. అలనాటి మారీచసుబాహుల్లా ఇప్పుడు ఉగ్రవాదు లు డ్రోన్లతో బాంబులు జారవిడుస్తున్నారు. వాటి నుంచి మన సైనిక స్థావరాలను, ఇతర కీలక కార్యాలయాలను, ప్రజలను కాపాడే శ్రీరామరక్ష లాంటి రక్షణ వలయం ఒకటి కావాలి. అలాంటి ‘స్వతంత్ర డ్రోన్‌ రక్షణ వలయా ’న్ని గ్రీన్‌ రోబోటిక్స్‌ అనే భారతీయ సంస్థ దేశంలోనే తొలిసారి, అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో సృష్టించామంటోంది. గ్రీన్‌ రోబోటిక్స్‌ రూపొందించిన ఆ టెక్‌ వలయం పేరు.. ఇంద్రజాల్‌. ఇది కూడా మన పురాణాల్లో వినిపించే పదమే. ఇంద్రజాలం అంటే.. ఇంద్రుడు చేసే మాయ. ఈ ‘ఇంద్రజాల్‌’.. మనకు హాని చేసే మాయదారి రోగ్‌ డ్రోన్స్‌ను గాల్లో ఉండగానే పసిగట్టి, వాటి పనిపడుతుంది.
అభివృద్ధి చెందిన కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్న ఈ సాంకేతికతతో మానవరహిత విమానాలను, లాయిటరింగ్‌ మ్యునిషన్స్‌ను (వీటినే సూయిసైడ్‌ డ్రోన్స్‌ అని కూడా అంటారు), లో రాడార్‌ క్రాస్‌ సెక్షన్‌టార్గెట్స్‌ను తనంత తానుగా నిలువరించే శక్తిగల అటానమస్‌ వ్యవస్థ ఇది. ఇంతటి కీలకమైన టెక్నాలజీని రూపొందించిన గ్రీన్‌ రోబోటిక్స్‌ ప్రధాన కార్యాలయం ఉన్నది మన హైదరాబాద్‌లోనే కావడం ఒక విశేషమైతే.. ‘ఇంద్రజాల్‌’ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి తెలుగు వాడు కావడం ఇంకా పెద్ద విశేషం. చాలా యాంటీ డ్రోన్‌ వ్యవస్థల్లా ఇది పాయింట్‌ డిఫెన్స్‌ వ్యవస్థ(నిర్ణీత ప్రదేశాన్ని మాత్రమే కాపాడే వ్యవస్థ) కాదని.. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ ఆధారంగా ఆధునిక రణక్షేత్రంలో నలుచెరగులా సత్తా చాటే అత్యం త అధునాతన సాంకేతిక పరిజ్ఞాన అద్భుతమని గ్రీన్‌ రోబోటిక్స్‌ సీఈవో, వింగ్‌ కమాండర్‌ ఎంవీఎన్‌ సాయి (రిటైర్డ్‌) పేర్కొన్నారు. ఉదాహరణకు.. పశ్చిమ దిక్కున మన సరిహద్దులను కాపాడుకోవాలంటే పాయింట్‌ డిఫెన్స్‌ విధానంలో 300 యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పరచుకోవాలి. అదే పరిధిలో.. తాము రూపొందించిన ఇంద్రజాల్‌ వ్యవస్థలు 6-7 అయితే సరిపోతాయని గ్రీన్‌ రోబోటిక్స్‌ తెలిపింది. ఇందులో ఉండే 9, 10 రకాల అత్యాధుని క వ్యవస్థలు.. దూసుకొచ్చే డ్రోన్లు, లాయిటరింగ్‌ మ్యునిష న్లు, లో ఆర్‌సీఎస్‌ టార్గెట్స్‌ను గుర్తించి, వాటిని అంచనా వేసి, ఏం చేయాలో నిర్ణయం తీసుకుని, తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తాయని వివరించింది.
ఇవన్నీ చేసే క్రమంలో అది మరిన్ని వివరాలను సేకరించి, విశ్లేషించి తనను తాను అప్‌డేట్‌ చేసుకుంటుందని(ఎవాల్వ్‌ అవుతుందని) వెల్లడించింది. అంతేకాదు.. గాల్లో దూసుకొచ్చే ది ఒక్క డ్రోనా లేక స్మార్ట్‌ స్వార్మా(డ్రోన్ల దండు) కూడా ‘ఇంద్రజాల్‌’ గుర్తించగలదని స్పష్టం చేసింది.
చాలాకాలంగానే..
జమ్మూలో డ్రోన్‌ దాడులు జరిగింది మూడు రోజుల క్రితమేగానీ.. ఈ ముప్పుపై చాలాకాలంగా చర్చ జరుగుతూనే ఉందని.. గ్రీన్‌ రోబోటిక్స్‌ సీఈవో సాయి తెలిపారు. ‘‘మనకు రాడార్లున్నాయి కదా? డ్రోన్లను ఎందుకు గుర్తించలేదు? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ, మన  రాడార్‌లు ఎయిర్‌క్రా్‌ఫ్టలను గుర్తించడానికి తయారైనవి. చిన్న చిన్న వస్తువులను అవి గుర్తించలేవు. అందుకే డ్రోన్స్‌ను రాడార్‌లో పట్టుకోవడం కష్టం. ఈ సమస్యకు ఓ విభిన్నమైన పరిష్కారం కావాలి. డిస్ట్రిబ్యూటెడ్‌ డిటెక్షన్‌ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థలో రాడార్లు, ఎలకా్ట్రనిక్‌ సిస్టమ్స్‌.. ఇలా 9-10 లేయర్లు ఉంటాయి. అలాంటి సమగ్ర వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే మనం మెరుగైన రక్షణ పొందగలం. మా ఇంద్రజాల్‌ అలాంటిదే’’ అని ఆయన వివరించారు. ‘‘ఇంద్రజాల్‌, స్వతంత్రం గా నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇదెలా సాధ్యమైందంటే.. మా ప్రాజెక్ట్‌లో పనిచేసే వారిలో అధికశాతం రక్షణ రంగంలో ఉన్నవారే. యుద్ధ రంగంలో ఎలా ఉంటుందో  తెలుసుకాబట్టి మా అనుభవాన్నంతా రంగరించి దీనిని తీర్చిదిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఒక సంఘటన(డ్రోన్లతో ఉగ్రదాడి) జరిగింది కాబట్టి పెద్ద రాడార్లు పెట్టి డ్రోన్లను గుర్తించేద్దాం అంటే కుదరదు. డ్రోన్‌ అనేది మీ ఇంటి నుంచి, మా ఇంటి నుంచి కూడా ఎగరవచ్చు. కాబట్టి నిరంతర పర్యవేక్షణకు ఒక అల్గారిథమ్‌ కావాలి. గుంపు డ్రోన్లు వస్తే.. ప్రతి దాన్ని ట్రాక్‌ చేయాలంటే ఏఐ ఆధారిత పరిష్కారం ఉండాలి. దేన్ని న్యూట్రలైజ్‌ చేయాలనే నిర్ణయం కూడా తీసుకోగలగాలి. ఇవన్నీ ఇంద్రజాల్‌ చేస్తుంది’’ అని ఆయన వివరించారు. తాము గత 8 ఏళ్లుగా దీనిపైపరిశోధన చేస్తున్నామని వెల్లడించారు. తాను ఈ టెక్నాలజీ కోసమే అంకితం అయినట్టు సాయి తెలిపారు. మరో 15-20 ఏళ్లు ఈ తరహా సాంకేతికతల అభివృద్ధికి కృషి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం బీఈఎల్‌తో కలిసి ఈ ప్లాట్‌ఫామ్‌పై పని చేయడానికి చూస్తున్నామన్న ఆయన.. డీఆర్‌డీవోతో సహా దేశ రక్షణకు కృషిచేసే ప్రతి సంస్థతోనూ కలిసి పనిచేయడానికి, తమ సాంకేతికతను అందించడానికి సిద్ధమని చెప్పారు.

Related Keywords

, Advanced Technical , Gallo The ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.