గోమతి రివ&#x

గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో సీబీఐ దాడులు


గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో సీబీఐ దాడులు
లక్నో(ఉత్తరప్రదేశ్):  గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తునకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం 40 కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.ఈ ప్రాజెక్టు అక్రమాలపై ఘజియాబాద్, లక్నో, ఆగ్రా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు.సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సర్కారు 2015లో 1600కోట్ల రూపాయలతో గోమతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేపట్టింది.
ఈ ప్రాజెక్టులో 189 మంది ఇంజినీర్లు, అధికారులు నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీబీఐ ఈ కేసు విచారణను ముమ్మరం చేసి 173 మంది ప్రైవేటు వ్యక్తులు,16 మంది చీఫ్ అధికారులు, ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు, ఆరుగురు అసిస్టెంట్ ఇంజినీర్లపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 

Related Keywords

Lucknow , Uttar Pradesh , India , Ghaziabad , Gomti River , India General , Akhilesh Yadav , Central Bureau , Gomti River Front , West Bengal , Samaj Janata , லக்னோ , உத்தர் பிரதேஷ் , இந்தியா , காஜியாபாத் , கொம்டி நதி , மைய பணியகம் , கொம்டி நதி முன் , மேற்கு பெங்கல் ,

© 2025 Vimarsana