ఆత్మలతో మ&#x

ఆత్మలతో మాట్లాడే సీఎంను చూస్తున్నాం


ఆత్మలతో మాట్లాడే సీఎంను చూస్తున్నాం
ప్రభుత్వ ఖజానా వెలవెల...సొంత ఖజానా గలగల: చంద్రబాబు
నడకుదిటి, కాగిత కుటుంబాలకు పరామర్శ
మచిలీపట్నం, విజయవాడ, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘‘పరిపాలనను, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆత్మల తో మాట్లాడే ముఖ్యమంత్రిని ప్రస్తుతం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని బతిమలాడుకున్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమాన్ని గాలికి ఒదిలేశారు. ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఆఖరుకు చెత్తపై కూడా ఈ చెత్త ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ముందు ముందు జుట్టు పన్నుకూడా వేస్తారు. ఇక అందరూ గుండు కొట్టించుకోవాల్సిందే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇటీవల మరణించిన మాజీమంత్రి నడకుదిటి నరసింహారావు, పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. నరసింహారావు భార్య విమల, కుమా ర్తె నీలిమ, అల్లుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలను పరామర్శించి ధైర్యం చెప్పారు. బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేటలోని కాగిత వెంకట్రావు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి మాణిక్యం, కుమారుడు కృష్ణప్రసాద్‌ను పరామర్శించారు.  నడకుదిటి, కాగితలు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు.  
మద్యం దుకాణాల వద్ద బడి పంతుళ్లా!
మచిలీపట్నం, నాగేశ్వరరావుపేటలలో చంద్రబాబు మాట్లాడారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లను మద్యం దుకాణాల వద్ద మందు బాబులను క్యూలో ని లబెట్టే పని చేయించుకున్నఘనత వైసీపీ ప్రభుత్వాని కే దక్కిందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ ఖజా నా వెలవెలబోతుంటే, ఆయన సొంత ఖజానా గలగల మంటోందన్నారు. భారతి సిమెంటు లాభాలు ఎలా పెరుగుతున్నాయో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నా రు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించిన జగన్‌రెడ్డి ఇంతవరకు సీపీఎ్‌సను ఎందుకు రద్దు చేయలేని ప్రశ్నించారు. 
పట్టిసీమ నీళ్లు తాగినా ఓటేయలేదు
రాష్ట్ర విభజన నేపథ్యంలో సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించామని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంత ప్రజలు పట్టిసీమ నీటిని తాగినా టీడీపీకి మా త్రం ఓటు వేయలేదన్నారు. నదీ జలాల వివాదంపై రెండు రాష్ర్టాల సీఎంలు కూర్చుని ఎందుకు మాట్లాడుకోరన్నారు. గిరిజనులకు పరిహారం ఇవ్వకుండా వారి గృహాలను గోదావరిలో ముంచి, వారిని కొండెక్కించారన్నారు. పులించిత ప్రాజెక్టుద్వారా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూసిందన్నారు. నీటిని కాలువలకు విడుదల చేయకుండా స ముద్రంలోకి వదిలేసిందన్నారు. రైతులు విక్రయించిన ధాన్యాని కి నగదు ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న ధాన్యం నగదు ఇవ్వమని కోరిన రైతులపై శాసనసభ్యులు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. బందరు పోర్టును... జగన్‌రెడ్డి తన హస్తగతం చేసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చదువు సంధ్యల్లేని బూతు, తాపీ కత్తి మంత్రులు ప్రతిపక్షంపై తమ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, జగన్‌రెడ్డికి భజనపరులుగా మారారన్నారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్జునుడికి గుండెపోటు 
తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి గుండెపోటు రావడంతో అత్యవసర చికిత్స కోసం విజయవాడలోని రమేశ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు ఆయనకు స్టంట్‌ వేశారు. ప్రాణాపాయం తప్పిందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలో పాల్గొన్న అర్జునుడు బంటుమిల్లిలో ఉండగా గుండెనొప్పి వచ్చింది.
నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు, విశాఖలో అక్రమంగా బాక్సైట్‌ తవ్వకాలు, పోలవరం నిర్వాసితులు, ప్రజలపై పన్నుల భారం, అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చడం, లెక్కల్లో చూపకుండా రూ.41 వేల కోట్ల చెల్లింపులు, కొవిడ్‌ బాధితుల విషయంలో నిర్లక్ష్యం తదితర అంశాలపై చర్చింనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఈ సమావేశం నిర్వహించనున్నారు. అన్ని అంశాలను చర్చించి అవసరమైన వాటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ కూడా రూపొందిస్తారని తెలిసింది. మరోవైపు శుక్రవారం పార్లమెంటరీ పార్టీ సమావేà°�

Related Keywords

Krishna Delta , Telugu Desam Party , Main Office , Wednesday His , Minister Kollam , Chandra District , President Chandra , Main Office Thursday , கிருஷ்ணா டெல்டா , பிரதான அலுவலகம் , புதன்கிழமை அவரது ,

© 2025 Vimarsana