సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (సోమవారం) నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని పేర్కొంది.