అమరావతి : అమరావతి ఉద్యమం ప్రారంభమై ఆదివారంతో 600 రోజులకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమరావతి పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి, దళిత జెఎసి, మహిళా, యువజన జెఎసి ఉద్యమ కార్యాచరణను నిన్న ప్రకటించాయి. అమరావతి ఆకాంక్షను ప్రభుత్వానికి తెలుపుతూ జెఎసి ఆధ్వర్యంలో రాజధాని రైతులు, మహిళలు ఆదివారం బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. హైకోర్టు సమీపంలోని న్యాయమూర్తుల గృహ సముదాయాల నుండి మంగళగిరి పానకాల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో....