నాని నిర్&#x

నాని నిర్మాణంలో ఆకాంక్షా సింగ్‌


నాని నిర్మాణంలో ఆకాంక్షా సింగ్‌
హీరో నాని వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా మారి సినిమాల‌ను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ, హిట్ చిత్రాల‌ను నిర్మాత‌గా నిర్మించిన నాని ఇప్పుడు ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నాని సోద‌రి దీప్తి ఘంటా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఇందులో ఆకాంక్షా సింగ్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఉమెన్ సెంట్రిక్ అంథాల‌జీగా రాబోతున్న‌ ఈ చిత్రంలో ఆకాంక్ష పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మ‌రి ఈ సినిమా ఈ అమ్మ‌డుకి టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ఇది వ‌ర‌కు మ‌ళ్లీ రావాలో సుమంత్ స‌ర‌స‌న‌, దేవ‌దాస్ చిత్రంలో నాగ్ స‌ర‌స‌న ఆకాంక్ష న‌టించింది. 

Related Keywords

Nani Ghanta , , Hero Nani , ஹீரோ நானி ,

© 2025 Vimarsana