ఆ పిల్లలు &#

ఆ పిల్లలు మళ్లీ అనాథలయ్యారు!


ఆ పిల్లలు మళ్లీ అనాథలయ్యారు!
కరోనాతో ‘దిశ’ ఉమ మృతి
గతంలో అనాథ దివ్యాంగులకు ఆశ్రయం
లక్ష్మీదేవిపల్లి, జూలై 17: ఇద్దరు అనాథ బాలల ను చేరదీసి తల్లిలా ఆదరించిన మానవతా మూర్తి మరణం.. మళ్లీ ఆ పిల్లలను అనాథలను చేసిం ది. ఇప్పుడు ఆ బాలలు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్తగూడేనికి చెందిన సామాజిక సేవకురాలు, దిశ కమిటీ సభ్యురాలు మందపల్లి ఉమ కరోనా బారిన పడి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కాగా, గతంలో ది క్కుతోచని స్థితిలో ఉన్న అనాథ దివ్యాంగులు నవీన్‌, మౌనికల దీన స్థితిపై ‘వారికి దిక్కెవరు?’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ఉమ వారిని చేరదీసిన విషయం వి దితమే.ఉమ చూపిన ప్రేమ వారి జీవితాల్లో కొత్త కాంతులను నింపింది.ఉమ సంరక్షణలో సంతోషంగా గడుపుతున్న వారికి విధి మరోసారి వక్రించింది. కరోనాతో ఉమ శుక్రవారం మరణించారు. దీంతో వారు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే తల్లి ఆశయాలను కొనసాగిస్తామని, ఆ దివ్యాంగులను అనాథలను కానివ్వబోమని ఉమ తనయులు భరోసా ఇస్తున్నారు. 

Related Keywords

Zuma Corona , Uma Bollywood , , Zuma Friday ,

© 2025 Vimarsana