నాకు 35 ఏళ్లు. ఇటీవల కొవిడ్ వచ్చి, తగ్గింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. ఆక్సిజన్ కూడా పెట్టారు. ఇప్పుడు బాగానే ఉంది గానీ అప్పుడప్పుడు ఒళ్లు వేడిగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా పని చేసినప్పుడు వేడి ఎక్కువగా ఉంటోంది. భయంగా అనిపిస్తోంది. దీనికి కారణమేంటి? ఇదేం వేడి?
ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు వినిపించే మాట ఇప్పుడు మన చుట్టుపక్కలా మార్మోగుతోంది. ఎంతోమంది మహిళలను కలవరపెడుతోంది. అదే రొమ్ముక్యాన్సర్. మనదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అధిగమించి ఇప్పుడిది అగ్రస్థానానికీ చేరుకుంది. మహిళల్లో తలెత్తుతున్న క్యాన్సర్లలో 35% క్యాన్సర్లు రొమ్ముకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. ముప్పు పసిగట్టండి