సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో మంగళవారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు చెరువులను తలపించగా..మళ్లీ కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. బల్దియా సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. ర�