కొవిడ్ అనంతరం హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు నిర్మాణదారులు. వీటిలో ఎక్కువగా హై ఎండ్, ప్రీమియం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విభాగంలో ఎంపిక చేసుకునేందుకు గతం కన్నాఅవకాశాలు ప్రస్తుతం ఎక్కువ ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు.. ఇంటి ఎంపికకు పెరిగిన అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలి�