ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ఆగస్టు 13వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు 6.55 శాతంగా నమోదయ్యింది. డిపాజిట్ల విషయంలో ఈ వృద్ధి 10.58 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. వివరాలు చూస్తే. 2020 ఆగస్టు 14 నాటికి రుణ మంజూరు పరిమాణం రూ.102.19 లక్షల కోట్లు. 2021 ఆగస్టు 13 నాటికి ఈ విలువ రూ.108.89 లక్షల కోట్లకు చేరింది. అంటే రుణ వృద్ధి