సాక్షి,అమరావతి: అఫ్గానిస్తాన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం కార్మికశాఖలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది.