‘గడగడ ఉరిమే మిరుగం వచ్చే. ఏమి పెడదమే చిన్న కోడలా..’ అని మామ అంటే ‘కోరీకోరీ కొర్రలు పెడదాం. తలచి తలచి తైదలు వేద్దాం’ అంటూ కోడలు పిల్ల సమాధానమిచ్చింది. ఇంతలో పొరుగింటామె ‘రెండెడ్ల అరకకట్టి.. పచ్చజొన్న పెడితిమమ్మో’ అంటూ గొంతు సవరించుకుంది. భలే ఉన్నాయే ఈ జానపదాలన్నీ అని ముచ్చటపడుతున్నారా? ఇవేకాదు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ వెళ్తే వందలాది పల్లె పదాలెన్నో స్వాగతం పలుక