సాక్షి, అమరావతి: నకిలీ చలాన్ల వల్ల ప్రభుత్వానికి గండిపడిన ఆదాయంలో రూ. 3,38, 11,190 రికవరీ చేశామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ) ధర్మా న కృష్ణదాస్ తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ ఎంవీ శేషగిరిబాబుతో ఈ అంశంపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు