కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో, థియేటర్స్ కి మెల్ల మెల్లగా పూర్వవైభవం వస్తోంది. కరోనా భయాన్ని వదిలి ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తుండటంతో నిర్మాతలు కూడా ఎలాంటి సందేహం లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు. గత శుక్రవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కల్యాణ మండపం మంచి ఓపెనింగ్స్�