టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి సినిమా సినిమాకి మధ్య గ్యాప్ బాగానే వస్తోంది. తాజాగా ఈ గ్యాప్ ఎందుకు వస్తుందో తెలిపారు. ఇప్పటి వరకు ఈయన ప్రభాస్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, నాగార్జున - కార్తి, రామ్ చరణ్ - అల్లు అర్జున్, లాంటి పెద్ద హీరోలతోనే సినిమాలు తీశారు. 2007 లో ప్రభాస్‌తో తీసిన మున్నాతో దర్శకుడిగా మారారు. దాదాపు 14 ఏళ్ళలో కేవలం 5 సినిమాలే చేశారు.