SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ ఏర్పాటు
న్యూజెర్సీ: ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరిట ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ (SPBMI) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా జూన్ 27న న్యూజెర్సీలో దీన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనల మధ్య 150 మంది నేరుగా, వేలాది మంది ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నార