ఈ కాలమంతా అనేక మంది పెద్దలు ఈ భూమిని దర్జాగా కాజేస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో దేవస్థానం అధికారుల అండతోనే నూతనంగా అనేక వాణిజ్య కట్టడాలు, అపార్ట్‌మెంట్లు వెలుస్తూనే ఉన్నాయి. విశాఖ నగర భూ కుంభకోణాలపై గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వేసిన రెండు సిట్ లకు ఈ భూములపై కూడా అనేక ఫిర్యాదులు అందాయి. అయితే ఈ సిట్ ల రిపోర్టులను ప్రభుత్వం నేటికీ బయట పెట్టలేదు. ఎవరిపైనా ఏ చర్యలూ తీసుకోలే