లక్ష ఎకరాల సాగునీరు కడలి పాలు!
వరదలు లేకుండానే ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల
ఈనాడు, అమరావతి: కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా గత 18 రోజుల్లో సముద్రంలోకి వదిలిన నీరు.. 11.3 టీఎంసీలు. ఈ నీటిని నిల్వ చేయగలిగితే దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగు అవసరాలు తీర్చే అవకాశం ఉండేది. భారీ వర్షాలు లేవు. వరద పోటెత్తలేదు. ఎగువన ప్రాజెక్టులు నిండలేదు. అయినా ఇంతనీరు సముద్రం పాలైంది. మున్ము