సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రిజర్వాయర్ల సంరక్షణకు సంబంధించిన జీవో 111 పరిధి పునఃపరిశీలన, అధ్యయనంలో జాప్యంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 45రోజుల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉన్నా..ఇప్పటికీ ఇవ్వకపోవడమేంటని నిలదీసింది. 22వ శతాబ్ధంలో నివేదిక ఇస్తుందా అని ప్రశ్నించింది. అయితే చివరగా మరో అవకాశం ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా